పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

WNP: ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి మండలంలోని గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించారు.