'జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి'
NLG: విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వ తేదీ వరకు జరిగే జాతీయ మహాసభల సందర్భంగా చిట్యాలలో సోమవారం ఏర్పాటు చేసిన సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు తమ ఇండ్ల మీద సీఐటీయూ జెండాలను ఎగురవేయాలని సూచించారు.