ఇల్లంద గ్రామస్థుల వినూత్న నిర్ణయం

ఇల్లంద గ్రామస్థుల వినూత్న నిర్ణయం

WGL: కోతుల బెడదను అదుపు చేస్తామని హామీ ఇచ్చే అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకుంటామని ఇల్లంద గ్రామస్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామంలో జనాభా కంటే కోతులు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒంటరిగా బయటకు అడుగు పెట్టాలంటే గ్రామస్థులు భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో కోతుల సమస్యను పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని గ్రామస్థులు ఏకమయ్యారు.