VIDEO: ఇసుక రీచ్ వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు
NGKL: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఇసుక రీచ్ వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.