'రూ. 490 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి'
PPM: సాలూరు నియోజకవర్గాన్ని రూ. 490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఆమె గుర్తుచేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని మొత్తం పనులను చేసుకుంటూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.