ఉద్యోగం పేరుతో రూ. లక్ష వసూలు.. తీరా చూస్తే..!
VSP: నగరంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారుష్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష వసూలు చేసింది. మొదటి 3 నెలలు రూ. 15 వేలు.. ఆ తర్వాత రూ. 31 వేల జీతం ఇస్తామని నమ్మబలికింది. తీరా ఉద్యోగంలో చేరాక యజమాని సాయికుమార్ జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.