న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

NTR: విజయవాడకు చెందిన న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గిరిజన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుండగా ఆయన సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన మహిళ మాచవరం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్సై శంకరరావు కేసు నమోదు చేశారు.