సీతానగరంలో విధి కుక్కల బెడద
E.G: సీతానగరం(మం) నాలుగు బొమ్మలు సెంటర్‌లో దాదాపు 10కి పైగా విధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండడంతో స్థానికులలో తీవ్రమైన భయం నెలకొంది. ఉదయం స్కూల్‌కు వెళ్లే పిల్లలు, మార్కెట్‌కు వచ్చే మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.