VIDEO: రహదారి వెంట కంపచెట్ల తొలగింపు..!
SRPT: అనంతగిరి మండలం వెంకటాపురంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదకరంగా పెరిగిన కంపచెట్లను సోమవారం తొలగించారు. సర్పంచ్ జయరాజ్ నేతృత్వంలో ఈ పారిశుద్ధ కార్యక్రమం చేపట్టారు. రహదారి పెంట చెట్లు పెరగడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తన లక్ష్యమని సర్పంచ్ తెలియజేశారు.