ఉప సర్పంచ్ పదవికి గ్రామాల్లో భారీ డిమాండ్

ఉప సర్పంచ్ పదవికి గ్రామాల్లో భారీ డిమాండ్

WGL: ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. సర్పంచ్ గెలుపు అవకాశం తక్కువగా ఉన్నవారు వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీ నిధుల విడుదలలో సర్పంచ్‌తో సమాన ప్రాధాన్యం లభించనుంది. దీంతో ఉప సర్పంచ్ పదవులకు గ్రామాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది.