అన్నవరంలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమం

అన్నవరంలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమం

ELR: నూజివీడు మండలం అన్నవరంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమం జరిగింది. ఇంఛార్జ్ హెచ్ఎం రవీంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పాఠశాల, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని ఈ సందర్భంగా హెచ్ఎం తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.