BREAKING: రెండ్రోజులు మద్యం షాపులు బంద్
TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసేవరకు మద్యం షాపులు బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కౌంటింగ్ సందర్భంగా 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం నిషేధించారు.