చైన్ స్నాచింగ్ ఘటనలో ఏసీపీ విచారణ

చైన్ స్నాచింగ్ ఘటనలో ఏసీపీ విచారణ

WGL: పర్వతగిరి మండలం చింత నెక్కొండకు చెందిన వృద్ధురాలు నల్లపు స్వర్ణలత మెడలోంచి 36 గ్రాముల బంగారు పుస్తెల తాడును సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన విషయం తెలిసిందే. ఈ చోరీపై మామునూరు ఏసీపీ వెంకటేశ్ మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.