వారంలో పీఏసీ సమావేశం: రేవంత్ రెడ్డి
TG: వారంలో పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, జిల్లా స్థాయి కమిటీల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.