మోటార్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కి నీరు తరలింపు

మోటార్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కి నీరు తరలింపు

బాపట్ల: పట్టణంలోని మూర్తి రక్షణనగర్ వద్ద ఉన్న మంచి నీటి చెరువుకు మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి చెప్పారు. ఆదివారం మోటార్ల ద్వారా నీటి తరలింపు ప్రక్రియను మున్సిపల్ ఏఈ కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం నీటిమట్టం 15అడుగులుగా ఉందని, మరో ఏడు రోజుల్లో 24 అడుగులకు నింపి నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు.