కిన్నెరసానిలో సందడి చేసిన పర్యాటకులు

BDK: పాల్వంచ మండలం కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. భద్రాద్రి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కిన్నెరసానికి తరలివచ్చారు. కిన్నెరసాని డ్యామ్, డీర్ పార్కులను వీక్షించారు. 619 మంది పర్యాటకులు రాగా వైల్డ్ లైఫ్ శాఖకు 33,310 ఆదాయం వచ్చింది. 320 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.15 వేల ఆదాయం లభించినది.