'రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలి'

HYD: రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి నిత్యావసరాలను పేదలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రేషన్ డీలర్లకు కనీస వేతనం రూ.5వేలు ఇవ్వాలన్నారు. ధర్నాచౌక్‌లో జరిగిన ధర్నాలో మాట్లాడుతూ.. రేషన్ కార్డుల బైఫరికేషన్ విధానాన్ని నిలిపి వేయాలన్నారు.