ఘనంగా వెంకటేశ్వర స్వామి, శివపార్వతుల కళ్యాణం
NZB: భిక్కనూరు మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి శివ పంచాయతన దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణంతో పాటు, శివపార్వతుల కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈకళ్యాణమహోత్సవాన్ని తిలకించెందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివార్ల దంపతులకు ఒడి బియ్యం పోసి కట్న కానుకలు సమర్పించుకున్నారు.