VIDEO: భారీ వర్షాలు.. డెలివరీ బాయ్స్‌కు తప్పని కష్టాలు

HYD: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు వాహనదారులతోపాటు, డెలివరీ బాయ్స్‌కు కష్టాలు తప్పడం లేదు. శనివారం రాత్రి టీకేఆర్ కమాన్ వద్ద ఓ జొమాటో డెలివరీ బాయ్ ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని బైక్, మొబైల్ ఫోన్ కొట్టుకుపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే తాడు సహాయంతో బైక్‌ను బయటకు తీశారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.