మానవత్వం చాటుకున్న సచివాలయ ఉద్యోగి

మానవత్వం చాటుకున్న సచివాలయ ఉద్యోగి

E.G: మండపేట మండలం పాలతోడుకు చెందిన వృద్ధాప్య పెన్షన్‌దారుడు బాలేశ్వరరావు అనారోగ్యంతో చెన్నైలో ఉన్నందున 3 నెలలుగా పెన్షన్ తీసుకోలేదు. పంచాయతీ కార్యదర్శి కె. వరప్రసాద్ సమాచారం అందించగా, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కంచిపాటి రాజు మానవతా దృక్పథంతో అర్థరాత్రి 12 గంటలకు చీరాల రైల్వే స్టేషన్‌లో ఆయనను కలిసి నగదును అందజేశారు. రాజు చూపిన అంకితభావాన్ని పలువురు అభినందించారు.