ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
హనుమకొండ 7వ డివిజన్, న్యూ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై తమ తెలుగు హిందూ సంప్రదాయాలను మరవకూడదని ఎమ్మెల్యే నాయిని అన్నారు. 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న, తదితరులు ఉన్నారు.