VIDEO: గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా చండూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో రూ.38.26 లక్షల వ్యయంతో నిర్మించబోయే గోదాము నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంటుందని తెలియజేశారు. రైతులకు నిల్వ సదుపాయాలు పెంపొందించేందుకే ఈ గోదాము ఉపయోగపడుతుందన్నారు.