చేగుంటలో చలివేంద్రం ఏర్పాటు
MDK: వేసవి ఎండల నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాంధీ చౌరస్తా వద్ద సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి, సతీష్ దీనిని ప్రారంభించారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకే చలివేంద్రాన్ని ప్రారంభించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫిక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.