క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: రాయదుర్గం పట్టణంలోని సీతా రామాంజనేయ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఇండో-అమెరికన్ బసవతారకం స్మారక ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉచిత వైద్య పరీక్షలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.