ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి శ్రీవాణి

NLG: డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అభినా చారిటబుల్ ట్రస్ట్, మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మకురు (ఎస్) మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో న్యాయ జడ్జ్ పి. శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకొని మంచి మార్గంలో జీవించాలని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు.