HYD మెట్రో.. జర్మన్ కోచ్‌లకు పెయింట్.!
HYD: ఫేజ్-1 బదిలీ తర్వాత ఆర్థిక భారం తగ్గించుకోవడానికి జర్మనీ నుంచి 24 రిఫర్బిష్డ్ లీజుకు తీసుకోవాలని అంతర్గత నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్‌ల కొనుగోలుకు బదులుగా వీటిని రీ-పెయింట్ చేసి వాడబోతున్నారట. IDBI క్యాపిటల్ దీనికి సంబంధించిన అసెట్ వాల్యుయేషన్ నివేదిక ఇచ్చింది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి అప్పగించే ఫైల్ క్లియరెన్స్ దశలో ఉంది.