'యూరియా పంపిణీపై ఆందోళన వద్దు'

'యూరియా పంపిణీపై ఆందోళన వద్దు'

శ్రీకాకుళం: రైతులకు పంపిణీ చేసే యూరియాపై ఎలాంటి అవకతవకలు ఉండవని, యూరియా కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ జడ్పీటీసీ రాజాపంతుల ప్రకాశరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కేశవరాయునిపాలెం రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అనవసర ఆందోళనకు గురికావద్దని, వ్యవసాయ సీజన్ మొత్తం ఎరువులు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.