తండ్రిని చంపిన కొడుకు

KRNL: కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామాచారిపై కుమారుడు వీరస్వామి మారణాయుధాలతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలై రామాచారి అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 3 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.