'నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం'

'నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం'

HNK: రైస్ మిల్లర్లు, వడ్ల కొనుగోలు సెంటర్ నిర్వాహకులు నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాయంపేట M నేరేడుపల్లి, ప్రగతి సింగారం, పలు గ్రామాల్లో ఐకేపీ, పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తాలు పేరు మీద రైస్ మిల్లర్లు దోపిడీ చేసి రైతుల రక్తం తాగుతున్నారన్నారు.