వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఎన్.తేజ్‌భరత్

వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఎన్.తేజ్‌భరత్

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ కమినర్‌గా ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కేఎస్ విశ్వనాథన్‌ను ఐఅండ్ పీఆర్ డైరెక్టర్‌గా బదిలీ చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.