VIDEO: కోట సత్తెమ్మ వారికి సారె సమర్పించిన భక్తులు
W.G: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ వారికి తిరునాళ్ళ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సారె సమర్పించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వారు సారె పంపించినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్ తెలిపారు. భక్తులు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.