రామయంపేట కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మండలంలో అధికార పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నూలి వెంకటేశ్వరరావు, యూత్ అధ్యక్షులు సాయి విజ్ఞాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కండువా కప్పి ఆహ్వానించారు.