మంత్రుల దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
MNCL: అభయారణ్యంలో ఇందిరమ్మ ఇళ్ళను అడ్డుకోకుండా మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాటి సభ్యులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని మంతుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.