నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు
WG: నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించాను. డాక్టర్లు, నర్సులు విధుల్లో సమయానికి అందుబాటులో ఉన్నారా అన్నది చూశారు. అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ సహా ప్రతి సేవ ఎలా పనిచేస్తోందన్నది పరిశీలించారు. శుభ్రత, పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవల ఆరా తీశారు.