రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన కృష్ణయ్య దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం వివాహానికి వెళ్లేందుకు బైకుపై బయలుదేరగా, చెలిమిల్ల సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.