కేంద్రమంత్రి పెమ్మసానిని కలిసిన ఎంపీ
NDL: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను నంద్యాల ఎంపీ, లోక్ సభ TDP డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్యాపిలి, భేతంచర్త, డోన్ మండలాల్లోని వేలాది కుటంబాలు తీవ్రమైన మొబైల్ నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రజల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.