ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అందజేత

మేడ్చల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగస్త్య హాస్పిటల్ సహకారంతో ఉప్పల్ ట్రాఫిక్ అధికారులు హెల్మెట్ లేకుండా రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి సుమారు 50 హెల్మెట్లు ఉచితంగా ఉప్పల్ రింగ్ రోడ్‌లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు, బబ్యా నాయక్, మల్లేష్ పాల్గొన్నారు.