వాతావరణంలో మార్పులు.. రైతులు అప్రమత్తం

W.G: పెనుగొండ మండలంలో సిద్ధాంతం, ఇలపర్రు, వడలి, రామన్నపాలెం తదితర గ్రామాలలో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులుతో వాతావరణం మార్పులు చోటు చేసుకుంది. దీంతో చేతికి వచ్చిన వంట కళ్ళల్లో ఉండడంతో ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి రైతులు పరుగులు పెట్టారు.