NRML: 'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'
NRML: గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయని అన్నారు.