రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు

SRCL: రేవతి నక్షత్ర సందర్భంగా గురువారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలోని అనంత పద్మనాభస్వామి వారికి పంచోపనిషత్ ద్వారాభిషేక పూజలు అర్చకులు చేశారు. అనంతరం పరివారదేవతార్చన పూజా కార్యక్రమం సైతం చేసినట్లు అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం సైతం విశేష పూజ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.