శెట్టిపల్లిలో ఉపాధి హామీ పనులు ప్రారంభం
SS: పెనుకొండ మండలం శెట్టిపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టెంకాయ కొట్టి పనులను అధికారులు ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ఈ పనులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సంజీవరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.