డివిజనల్ పౌర సంబంధాల అధికారికి ఉత్తమ అవార్డు

డివిజనల్ పౌర సంబంధాల అధికారికి ఉత్తమ అవార్డు

ASR: జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న పండు రాములు ఉత్తమ అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రాములు ఉద్యోగ జీవితంలో 16 అవార్డులు అందుకున్నారు.