కొయ్యూరులో ఎదుట వాహన తనిఖీలు
ASR: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు వాహనదారులకు సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు ఇతర రికార్డులను పక్కాగా కలిగి ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు.