ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై, సీఐ
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాస ఉత్సవాల ఏర్పాట్లను లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై తహిసొద్దీన్ పరిశీలించారు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. దీంతో దేవాలయంలో చేస్తున్న ఏర్పాట్లను వారు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.