అంకుర గణపతి విగ్రహాల పంపిణీ

అంకుర గణపతి విగ్రహాల పంపిణీ

BPT: వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రేపల్లె టీడీపీ కార్యాలయంలో మంగళవారం అంకుర గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులుగా నీటిలో త్వరగా కరిగిపోయే మట్టితో ఈ విగ్రహాలను తయారు చేశారు. ఈ విగ్రహాలలో ఒక విత్తనం కూడా ఉంచారు. పూజల అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తుతుంది.