పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

NRPT: మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి మండలంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం టాస్క్ ఫోర్స్, మద్దూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5, 400/- నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.