పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: నిజాంపేట మండలం రామిరెడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.