VIDEO: కొలనూరుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు
PDPL: ఓదెల మండలం కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) మంజూరు కావడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే గేటు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పలుమార్లు లేఖలు, వినతులు అందించడంతో రైల్వే శాఖ ఆర్ఓబీ నిర్మాణానికి అంగీకరించిందని పేర్కొన్నారు.