అమరావతి రైతులకు ముఖ్య గమనిక

అమరావతి రైతులకు ముఖ్య గమనిక

GNTR: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ముఖ్య గమనిక. సీఆర్డీఏ (CRDA) ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే 'గ్రీవెన్స్ డే' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. సాధారణంగా రాజధాని రైతులు, కూలీలు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంతో ఈ విషయాన్ని రాజధాని ప్రాంత వాసులు గమనించాలని కోరింది.