కదిరిదేవరపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ
ATP: కంబదూరు మండలం కదిరిదేవరపల్లిలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బాల్యం రాజేశ్ హాజరయ్యారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.